లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

Aug 26 2025 8:28 AM | Updated on Aug 26 2025 8:28 AM

లోక్‌

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జిల్లా న్యాయసేవాధికార

సంస్థ కార్యదర్శి శుభవల్లి

మెదక్‌జోన్‌: వచ్చే నెల 13న నిర్వహించే జాతీ య లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌ఎం శుభవల్లి కోరారు. సోమవారం మెదక్‌ కోర్టు ఆవరణలో ఆమె మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌, ఇన్సూరెన్స్‌, బ్యాంకు, చిట్‌ఫండ్‌ తదితర కేసుల్లో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగే కక్షిదారులు లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకుంటే ఇరుపక్షాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

విఘ్నేశ్వర రైతుల బాధలు

ఆలకించవయ్యా..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): యూరియా కోసం రైతులు నరకయాతన పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో రైతులకు అవసరమైన యూరియా తెప్పించేలా చూడు స్వామి అంటూ వినాయకుడికి విజ్ఞాపనపత్రం అందజేశారు. రైతుల కోసం ఎన్నో చేస్తామంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు సాగుకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, బట్టి జగపతి, అంజాగౌడ్‌, కిష్టయ్య, మేకల సాయిలు, సతీశ్‌రావు, జీవన్‌రావు, గంగా నరేందర్‌, లక్ష్మీనారాయణ, కిషోర్‌, హన్మంత్‌, స్వామినాయక్‌, రంజిత్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌ కమీషన్‌ వెంటనే

విడుదల చేయండి

నర్సాపూర్‌: ప్రభుత్వం ఐదు నెలలుగా రేషన్‌ కమీషన్‌ విడుదల చేయలేదని రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం నుంచి కమీషన్‌ రాకపోవడంతో తాము ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఇప్పటికై నా తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి రవిగౌడ్‌, నాయకులు జయపాల్‌, ఫయిమోద్దీన్‌, నర్సింలు, గోవర్దన్‌రెడ్డి, సర్దార్‌, రాజు, వంకరయ్య, శ్రీశైలం, అశోక్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నానో యూరియాతో మేలు

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు యూరియాకు బదులుగా నానో ద్రవరూప యూరియా వడటం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు పంటకు ప్రయోజనం, అధిక దిగుబడి పొందవచ్చని డీఏఓ దేవ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని మహమ్మద్‌నగర్‌లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. నానో యూరియా కాలుష్యాన్ని తగ్గించి పర్యవరణాన్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, ఏఈఓలు సాహితి, స్రవంతి, రైతులు పాల్గొన్నారు.

వైద్య సేవలపై ఆరా

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల పరిధిలోని సర్ధన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, పీహెచ్‌సీలో స్టాక్‌ ఉన్న మందుల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వైద్య శిబిరం ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. డాక్టర్‌ వినయ్‌ను అభినందించారు. ఆయన వెంట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఉన్నారు.

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
1
1/3

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
2
2/3

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
3
3/3

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement