
కళకళ
విలవిల
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలోని పెద్దచెరువు, ధర్మాసాగర్ పటేల్ చెరువు కింద ఆయకట్టు వరి పంట పచ్చని రంగులతో కళకళలాడుతుంది. మండల వ్యాప్తంగా సుమారు వేల ఎకరాల్లో వరి సాగు చేయడంతో ఎటు చూసినా పచ్చని పొలాలతో కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి చెరువు కుంటలు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని కూచన్‌పల్లి, సర్దన మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. దీంతో పెట్టిన పెట్టుబడితో పాటు పంట నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దాదాపు 30 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటలు మంజీరా వరద ఉధృతితో మునిగిపోయాయన్నారు. దీంతో పూర్తిగా వరి కుళ్లి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.

కళకళ