చదువుతో పాటు క్రీడలు ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం

Aug 27 2025 9:57 AM | Updated on Aug 27 2025 10:05 AM

డీఈఓ రాధాకిషన్‌

పెద్దశంకరంపేట(మెదక్‌): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని డీఈఓ రాధాకాషన్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం, హెచ్‌ఎంలు శేఖర్‌, శిరీష, శ్రీనివాస్‌, మారుతి, కుమార్‌, ప్రసన్నకుమార్‌, గోపి, నందయ్యగారి శ్రీను, ఆనంద్‌, అశోక్‌రెడ్డి తదితరులున్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

డీపీఎం మల్లేశం

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని డీపీఎం మల్లేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో 8వ వార్షిక మహాసభలో ఆయన మాట్లాడారు. మండలంలో మహిళా సమాఖ్య 387 గ్రూపులతో కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారన్నారు. మహిళల్లో పోటీతత్వం పెరిగిందన్నారు. బదిలీపై వెళ్లిన ఐకేపీ సిబ్బంది ప్రేమలత దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం యాదయ్య, శ్రీనిధి ఆర్‌ఎం గంగారం, అసిస్టెంట్‌ మేనేజర్‌ పరమేశ్వరి, ఐపీఎం గౌరిశంకర్‌, మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత, కార్యదర్శి మాధురి, కోశాధికారి అంజలి, సీసీలు పురుషోత్తం, వరలక్ష్మి, నర్మద, వెంకటలక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నేరుగా కాస్మొటిక్‌ చార్జీలు

బీసీ సంక్షేమ అధికారి జగదీష్‌

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యార్థులకు అందించాల్సిన కాస్మొటిక్‌ చార్జీలను ప్రతినెలా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్‌ తెలిపారు. ఫ్రీ మెట్రిక్‌–17, పోస్ట్‌ మెట్రిక్‌–4 కలిపి మొత్తం 21 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయన్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు మెదక్‌–2, నర్సాపూర్‌లో 2 ఉండగా.. 517 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అలాగే బాలికలు–4, బాలురు–13 చొప్పున మొత్తం 17 ఫ్రీమెట్రిక్‌ హాస్టళ్లు ఉండగా.. 1,467 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఫ్రీమెట్రిక్‌ విద్యార్థులకు నెలకు రూ.175, ఫోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు నెలకు రూ.200, బాలికలకు అదనంగా మరో రూ.75 జమవుతుందన్నారు. అలాగే ఫ్రీమెట్రిక్‌ విద్యార్థులకు నెలకు రూ.1,430, ఫోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు రూ.1,540ల చొప్పున మెస్‌ చార్జీలు అందజేస్తున్నట్లు చెప్పారు.

ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయాలి

పీఆర్టీయూటీఎస్‌

అసోసియేట్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌: టీచర్ల ప్రమోషన్స్‌ ప్రక్రియతో భారీగా ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయని, వెంటనే డీఎస్సీ ప్రకటించి భర్తీ చేయాలని పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోషన్ల ప్రక్రియతో మెదక్‌ జిల్లాలో సుమారుగా 200 పోస్టులు ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కొరతను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలన్నారు. ప్రమోషన్స్‌ ద్వారా కొత్త ఖాళీలు ఏర్పడటంతో సర్దుబాటు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెరిగిన నేపథ్యంలో తక్షణమే డీఎస్సీపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం1
1/3

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం2
2/3

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం3
3/3

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement