
ముఖ గుర్తింపుతో పింఛన్లు
రామాయంపేట(మెదక్): పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్ ) ఆధారంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. దీంతో పంపిణీలో అక్రమాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. గత నెల నుంచే ఈ విధానంతో కొన్ని జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలో సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. జిల్లాలో 1,11,808 పింఛన్‌దారులు ఉన్నారు. సింహ భాగం పింఛన్ల పంపిణీపోస్టాఫీసుల ద్వారానే జరుగుతుంది. ఈ మేరకు జిల్లాకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన 111 సెల్‌ఫోన్లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు, స్కానర్లు మంజూరయ్యాయి. వీటిని జిల్లా కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో భద్రపర్చారు. వీటిని ఫోస్టాఫీసుల్లో పోస్టుమాస్టర్లకు అందజేయనున్నారు. వీటి సహాయంతో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జిల్లా పరిధిలో పింఛన్లను పోస్టాఫీసుల ద్వారానే లబ్ధిదారులకు అందిస్తుండగా, మిగతావి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అంధులు, దివ్యాంగులు ఉంటే పంచాయతీ కార్యదర్శుల ద్వారానే వారికి పింఛన్లు అందనున్నాయి.
అవినీతికి చెక్ పెట్టేందుకే..
జిల్లా కేంద్రానికి
చేరిన సెల్‌ఫోన్లు, స్కానర్లు
ఇది మంచి పరిణామం
ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ల పంపిణీ మంచి పద్ధతి. దీంతో లబ్ధిదారుల కష్టాలు తీరునున్నాయి. ముఖ గుర్తింపుతో డబ్బులు నేరుగా అందుతాయి. అంధులుంటే పంచాయతీ కార్యదర్శుల సహాయంతో వారికి అందేలా ఏర్పాటు చేస్తున్నాం.
– శ్రీనివాసు, డీఆర్డీవో, మెదక్

ముఖ గుర్తింపుతో పింఛన్లు