
అవసరమైన చోట ఫ్లైఓవర్లు
టేక్మాల్(మెదక్): జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈమేరకు సోమవారం మండలంలోని బొడ్మట్‌పల్లి వద్ద సంగారెడ్డి– నాందేడ్ నేషనల్ హైవేపై అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ప్రమాదాల స్పాట్ లను స్వయంగా చూపించి, ఫై ఓవర్ల నిర్మాణ ఆవశ్యకతను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు వివరించారు. దీంతో నిర్మాణానికి వారు అంగీకరించారు. గుండువాగు వర్షం నీరు గ్రామంలోకి రాకుండా పూడిక తీయాలని గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం బొడ్మట్‌పల్లిలో పర్యటించి ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ రియాజొద్దీన్, ఆర్‌ఐ సాయి శ్రీకాంత్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షు డు నిమ్మ రమేశ్, సీనియర్ నాయకులు మాన్‌కిషన్, యూసూఫ్, విష్ణువర్దర్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యనారాయణ, శ్రీధరాచారి, సత్యం ఉన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ