
ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విన తులు స్వీకరించారు. మొత్తం 96 అర్జీలు రాగా, భూ సమస్యలపై అత్యధికంగా వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో పాటు ఆయాశాఖల జిల్లా అధికారు లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 41 నూ తన అంగన్‌వాడీ భవన సముదాయాల నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించేలా చూడాలన్నారు. మిషన్ వాత్సల్య కింద నిర్మాణం చేపట్టిన బాలల సదనం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్