
దరఖాస్తు చేసుకుంటే కనెక్షన్
మెదక్ కలెక్టరేట్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, ఉత్సవ కమిటీలు మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నారాయణనాయక్ తెలిపారు. వినాయక విగ్రహాల ఊరేగింపు నేపథ్యంలో సోమవారం పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు 15 ఫీట్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీలు విద్యుత్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ లోడ్ లైటింగ్, సౌండ్ సిస్టమ్, అలంకరణ వివరాలు దరఖాస్తులో స్పష్టంగా ఇవ్వాలన్నారు. అనధికార కనెక్షన్లు తీసుకోవద్దని, తామే ఉచితంగా పోల్ నుంచి కనెక్షన్ ఇస్తామని తెలిపారు. మండపాల వద్ద ఏబీ స్విచ్‌లు, ఎర్తింగ్ ఏర్పాటు చేసుకుంటూ పూర్తి బాధ్యత తీసుకుంటూ కమిటీలు హామీ ఇవ్వాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఎస్‌ఈ నారాయణనాయక్
ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు
పాటించాలని సూచన