
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్
తూప్రాన్: ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని అల్లాపూర్, రావెల్లిలో రైతు లు వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్‌పామ్ మొక్క లు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగుకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, ఈ మొక్కల ద్వారా 30 ఏళ్ల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. తోటలో అంతర పంటలు వేసుకొని ఆదాయం పొందవచ్చన్నారు. ఆసక్తి గల రైతులు వివరాలకు 8977725910 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, ఏఈఓ సంతోశ్‌కుమార్, ఆయిల్‌పాం కంపెనీ మేనేజర్ కృష్ణ, అశోక్, ఫీల్డ్‌ఆఫీసర్ నిశాంత్, గ్రామ రైతులు పాల్గొన్నారు.