
వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న
మెదక్ కలెక్టరేట్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్ జయంతి కా ర్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్నివర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ పోరాడారని గుర్తుచేశారు. మహనీయుల స్ఫూర్తితో ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సామ్యనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్‌ను సోమ వారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. సీపీఎస్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందన్నారు. మహాధర్నాకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి, సతీశ్‌రావు, శ్రీనివాశ్, మహేశ్ కుమార్, ఆయా మండలాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అక్రమ నిల్వలపై కఠిన చర్యలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యూరియా అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ భుజంగరావు, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా లోని వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా వ్యవసాయం కోసం మాత్ర మే వినియోగించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణం
త్వరగా పూర్తి చేయాలి
హవేళిఘణాపూర్(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణశాఖ పీడీ మాణిక్యం సూచించారు. సోమవారం మెదక్ మండలం పేరూరు లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. నిరుపేదల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఇళ్లు మంజూ రు చేసిందదన్నారు. బిల్లులు వెంట వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని పేర్కొన్నారు.
మెదక్ ఆర్టీసీ డిపో సందర్శన
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను సోమవారం రాత్రి ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుశ్రోషా ఖాన్ స్థానిక ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు డిపో గ్యారేజీ, ట్రాఫిక్ సెక్షన్, బస్టాండ్‌లను పరిశీలించారు. ఆయన వెంట ప్రాంతీయ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్, డిప్యూటీ రీజినల్ మేనేజ ర్ కృష్ణమూర్తి, సెక్రటరీ శ్రీనివాస్ ఉన్నారు.

వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న

వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న

వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న