
సివిల్ తగాదాల్లో తల దూర్చొద్దు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్‌మున్సిపాలిటీ: జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సివిల్ తగాదాల్లో తలదూర్చితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సివిల్ తగాదాల్లో పోలీసుల ద్వారా బాధపడిన వారు పోలీస్ కంట్రోల్ రూం 8712657888 నంబర్‌కు, లేదా తనను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. అనంతరం జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్‌ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.