లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు

Aug 19 2025 8:11 AM | Updated on Aug 19 2025 8:11 AM

లక్షణ

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు

మండలాల వారీగా అధికారుల సర్వే వివరాల సేకరణలో నిమగ్నం

రామాయంపేట(మెదక్‌): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా.. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బు లు లేక పలువురు లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గడువు సమీపిస్తున్నా, ఇప్పటివరకు పనులు షురూ చేయలేదు. ఈ మేరకు వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులుగా ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించాలని చర్యలు చేపట్టింది. జిల్లాకు మొదటి విడతగా ప్రభుత్వం 9,125 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులను గుర్తించి ప్రాధాన్యం ఇచ్చింది. వారికి నాలుగు విడతల్లో రూ. ఐదు లక్షలు అందించాలని నిర్ణయించింది. ఆర్థికంగా ఉన్న వారు ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా, నిరుపేద లబ్ధిదారులు మాత్రం ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా 3,600కు పైగానే ఉన్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అండగా నిలుస్తుంది. లబ్ధిదారులు మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి, కనీసం ఆరు నెలలుగా పొదుపు చేస్తున్న వారై ఉండాలని పేర్కొంది. వారిని గుర్తించడానికి మండలాల వారీగా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. తాము గుర్తించిన లబ్ధిదారులకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు గ్రామ సమాఖ్యల ద్వారా రుణం ఇప్పించడానికి కృషి చేస్తున్నారు.

వివరాల సేకరణలో అధికారులు

గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు, ఇంకా పనులు ప్రారంభించని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారులు మొదలుకొని గ్రామస్థాయి అధికారులు ప్రతి రోజూ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు వారు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. ఈ మేరకు నిర్మాణాలు ప్రారంభించని వారి జాబితా రూపొందిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని వారికి డ్వాక్రా రుణం

జిల్లా వివరాలు

మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు 9,125

పనులు ప్రారంభించినవి 5,500

ప్రారంభం కానివి 3,625

బేస్‌మెంట్‌, గోడల వరకు

పూర్తయినవి 1,700

వివరాలు సేకరిస్తున్నాం

జిల్లావ్యాప్తంగా 3,500కు పైగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వారికి అవగాహన కల్పిస్తున్నాం. నిరుపేద స్థితిలో ఉన్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారు ఖచ్చితంగా మహిళా గ్రూపులో సభ్యురాలై ఉంటే రుణం కోసం వారి వివరాలను డీఆర్డీఓ అధికారులకు పంపిస్తాం.

– మాణిక్యం, పీడీ, గృహ నిర్మాణశాఖ

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు 1
1/2

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు 2
2/2

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement