
ముంచెత్తిన వాన
మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలు
● పొంగిపొర్లుతున్న హల్దీ, మంజీరా ● పలు మండలాల్లో కొట్టుకుపోయిన రోడ్లు ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● నీట మునిగిన వివిధ పంటలు ● అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన
మెదక్‌జోన్: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా పన్నెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. పలు చోట్ల కుంటలకు గండ్లు పడగా, రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్– కామారెడ్డి సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. అటువైపు పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సింగూరు నుంచి దిగువకు నీరు వదటం, దానికి భారీ వర్షాలు తోడు కావడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. పది మండలాల్లో అతి భారీ వర్షం నమోదు కాగా, ఏడు మండలాల్లో మోస్తరుగా నమోదు అయిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
అత్యవసరమైతేనే బయటకు రండి
టేక్మాల్(మెదక్)/వెల్దుర్తి(తూప్రాన్)/తూప్రాన్: గడిచిన 72 గంటల్లో జిల్లాలో భారీ వర్షం కురవడంతో సుమారు పది చోట్ల వంతెనలపై నుంచి వరద ప్రహిస్తుంది, అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఉప్పులింగాపూర్ బ్రి డ్జిని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సింగూరు, మంజీరా, హల్దీవాగు పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లో లైన్ రోడ్స్, కా జ్‌వేలు, కల్వర్టులు, బ్రిడ్జిలు ఓవర్ ఫ్లో అవుతున్నందున, ఆయా చోట్ల ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. రానున్న 48 గంటల పాటు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో కలెక్టరేట్, పోలీస్ కంట్రోల్ రూమ్‌లకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో సుమారు 2,600 చెరువులు ఉండగా, అందులో 90 శాతం చెరువులు నిండిపోయాయన్నారు. వరద ప్రవహించే ప్రాంతాల్లో సెల్ఫీలు, చేపలు పట్టడానికి దూరంగా ఉండాలన్నారు. ఆయన వెంట వివిధశాఖల అధి కారులు ఉన్నారు.
మంజీరా.. మహోగ్రం
పాపన్నపేట(మెదక్): మంజీరా మహోగ్ర రూ పం దాల్చింది. సోమవారం ఘనపురం ఆనకట్టపై నుంచి 69,700 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎల్లాపూర్ వద్ద మంజీరా ప్రవాహాన్ని పరిశీలించారు. ఐదు రోజులుగా దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.
ఆరాతీసిన మంత్రి దామోదర
బొడ్మట్‌పల్లిలో వరద నీటికి ఇళ్లలో చేరిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ డీపీఓ యాదయ్యతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదనీరు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన