
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ఎమ్మెల్యే సునీతారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ చూపుతారన్నారు. విద్యార్థులు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, ఎంఈఓ బాలరాజు, మండల వైద్యాధికారి శ్రీకాంత్, వైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చిత్రపటాన్ని గురుకుల పాఠశాల విద్యార్థి గీసి బహూకరించారు.