
మెదక్ : భార్య అదృశ్యంపై ఓ వ్యక్తిపై అనుమానం ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన చందన్ కుమార్ భార్యతో వచ్చి పటాన్‌చెరు జె.పి కాలనీలో ఉంటూ, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే చందన్ భార్య ఖుషి కొన్ని రోజులుగా సౌరబ్ కుమార్ అనే వ్యక్తితో చనువుగా ఉంటుంది.
ఈ క్రమంలో ఆగస్టు 12న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చందన్ భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి సౌరబ్ ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా అక్కడ అతనితో ఉంది. దీంతో భార్యని తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి ఇంటి నుంచి ఖుషి వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. సౌరబ్‌పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.