సమన్వయంతో పనిచేయండి
తూప్రాన్/మనోహరాబాద్/పాపన్నపేట(మెదక్): జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ను పారదర్శకంగా నిర్వహించేందకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతినాయక్ అన్నారు. ఆదివారం తూప్రాన్, మనోహరాబాద్, పాపన్నపేట మండలాల్లో రెండో విడతలో భాగంగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులకు అందించే మార్గదర్శకాలపై సూచనలిచ్చారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అందరూ సమన్యయం చేసుకొని ఎన్నికలు శాంతియుతంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.


