ఏకగ్రీవం దిశగా అడుగులు
● తండాలు, గ్రామాల్లో సమావేశాలు ● సర్పంచ్ పదవులకు వేలం పాట ● రామాయంపేట మండలం కొత్తగా పంచాయతీగా ఆవిర్భవించిన జెమ్లా తండాలో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, అక్కడ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల సహకారంతో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరు తండాలో ఆలయ నిర్మాణానికి రూ. 3 లక్షల వరకు ఇస్తామని అంగీకరించగా, సమస్య కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
● అలాగే పర్వతాపూర్ పంచాయతీ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే రూ. 4 లక్షల వరకు ఇస్తానని ఓ వ్యక్తి సమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఇందుకు గాను తండావాసులు అంగీకరించినా, గ్రామస్తులు మాత్రం ఒప్పుకోవడం లేదు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్యను పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు తెలిసింది.
● నిజాంపేట మండలం చౌకత్‌పల్లి, నగరం గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం తండాల్లో పలుమార్లు సమావేశమై చర్చించారు.
● తిప్పనగుల్లలో సర్పంచ్‌తో పాటు పంచాయతీ సభ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గ్రామస్తులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
● తండాలు, గ్రామాల్లో సమావేశాలు ● సర్పంచ్ పదవులకు వేలం పాట
రామాయంపేట(మెదక్): పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యు ల ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు గ్రామాల్లో పేరు న్న నాయకులు ఆశావహులను బుజ్జగించే పనిలో నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా పంచాయతీలుగా ఏర్పాటైన గిరిజన తండాల్లో ఎక్కువ శాతం ద్విముఖ పోటీ జరిగే ఆస్కారం ఉంది. జిల్లా పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చిన్నశంకరంపేట, తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, మెదక్ మండలాల్లో ఆదివారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.