మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
పెద్దశంకరంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఆదివారం మండలానికి చెందిన మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణతో పాటు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరగా, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. తాము కేసీఆర్ వారసులమని, బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, డీసీఎంస్ మాజీ చైర్మన్ శివకుమార్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, సురేశ్‌గౌడ్, జంగం రేణుక, భవాని, శంకర్‌గౌడ్, సుభాశ్, లింగయ్య, జంగం రాఘవులు, దశరత్, తదితరులు పాల్గొన్నారు.


