రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాపన్నపేట(మెదక్): రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 28 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంపిక పోటీల్లో బాలిక ల విభాగం నుంచి 70 మంది, బాలుర విభా గం నుంచి 75 మంది పాల్గొనగా, ఒక్కో విభా గం నుంచి 14 మంది చొప్పున మొత్తం 28 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులకు ఈనెల 2 నుంచి పోటీలు జరుగుతాయని చెప్పారు. బాలురకు మహబూబ్‌నగర్, బాలికలకు నల్గొండలో పోటీలు జరుగుతాయని తెలిపారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
చేగుంట(తూప్రాన్): మండలంలోని బోనాల్ ఫీ డర్ లైన్ మరమ్మతుల కారణంగా సోమవారం కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రామాయంపేట ఏడీఎ ఆదయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గొల్లపల్లి కన్యారం, రాంపూర్, చిన్నశివునూర్ గ్రామాలు తండాల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయానికి ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.
రోడ్డు నిర్మాణానికి
నిధుల మంజూరు: ఎమ్మెల్యే
చేగుంట(తూప్రాన్): వడియారం బైపాస్ నుంచి చేగుంట మీదుగా రెడ్డిపల్లి చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం చేగుంట సర్పంచ్ అభ్యర్థి దుంపల రమ్య నామినేషన్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వడియారం మాజీ ఎంపీటీసీ లక్ష్మి అనారోగ్యానికి గురి కాగా పరామర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, అలీ, సత్యనారాయణ పలు గ్రా మాల నాయకులు పాల్గొన్నారు.
7 నుంచి సీఐటీయూ
మహాసభలు
మెదక్ కలెక్టరేట్: ఈనెల7, 8, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతుందన్నారు. 4 లేబర్‌కోడ్‌లు తెచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. కనీస వేతనం రూ. 26,000 అమలు చేయడం లేదన్నారు. అనంతరం సీఐటీయూ కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. పనిభారం పెంచుతూ శ్రమను దోచుకుంటుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను చర్చించడానికే మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీలో చేరికలు
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగజ్‌మద్దూర్‌కు చెందిన వీరాంజనేయులుగౌడ్, సంతో ష, అమరేందర్‌గౌడ్‌తో పాటు పలువురు ఆది వారం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకుడు అరవింద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మూడు సర్పంచ్
స్థానాలు ఏకగ్రీవం
టేక్మాల్(మెదక్): మండలంలో మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలోని సాలోజిపల్లి సర్పంచ్‌గా ఇర్షద్, హసన్‌మహ్మద్‌పల్లి చందునాయక్, చల్లపల్లి ఎల్లపల్లి సంగీత నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం జరిగిన పరిశీలనలో మూడు గ్రామాల నుంచి ఒకే నామినేషన్ రావడంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు ఎంపీడీఓ రియాజొద్దీన్ తెలిపారు.


