హుస్నాబాద్‌ను కోనసీమగా తీర్చిదిద్దుతా
హుస్నాబాద్: నియోజకవర్గాన్ని, ఆదర్శవంతంగా, మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలిలో విలేకరులతో మా ట్లాడారు. 3న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సహచర మంత్రులను హుస్నాబాద్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణం, ఏటీసీ, రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్, హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 4 లేన్ల రహదారి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆర్టీఏ కార్యాలయ భవనం, ఇందిరా మహిళా శక్తి బజార్, ఉమ్మాపూర్‌లో అర్బన్ పార్క్ ఏర్పాటు, మహిళా సంఘాలకు బస్సులు, హైదరాబాద్ నుంచి హుస్నాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభిస్తారని పొన్నం తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
3న సీఎం రేవంత్ రాక
రూ. 480.36 కోట్ల అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చేస్తారని వెల్లడి


