
మండపాల వివరాలు నమోదు చేసుకోవాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో వినాయక మండపాలు, విగ్రహాల వివరాలను పోలీస్‌శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు నిర్వాహకులకు సూచించారు. రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా సంసిద్ధమై ఉందన్నారు. వినాయక చవితి మొదలు, నిమజ్జన తేదీ, సమయం, ప్రయాణించే దారి, మండప ప్రదేశం తదితర వివరాలను పొందుపరచాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు కృషి చేయాలని, మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, వెంటనే డయల్ 100లో సంప్రదించాలని సూచించారు.
బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి
మెదక్ కలెక్టరేట్: హవేళిఘణాపూర్ మండలంలోని ధూప్‌సింగ్ తండా వద్ద ఇటీవల కురిసిన వర్షాలతో తెగిపోయిన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రిడ్జి వద్ద నిరసన తెలిపి మా ట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పద్మారెడ్డి కేవలం పరిశీలనకే పరిమితం అ య్యారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని వెంటనే బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్య దర్శి రంజిత్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ ద్వారా
సహాయక చర్యలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లోని ఫ్లడ్ కంట్రోల్ రూం ద్వారా ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూంను సందర్శించారు. ఈసందర్భంగా ఫిర్యాదుల రిజిస్టర్‌ను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలకు సహాయం అందించడానికి, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. వరదలు వచ్చినప్పుడు, వచ్చే అవకాశం ఉన్నప్పుడు చేపట్టే నియంత్రణ చర్యల కోసమే కంట్రోల్ రూమ్ సహాయపడుతుందన్నారు.
రోడ్ల మరమ్మతులు
పూర్తి చేయాలి
మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...అందోల్ ని యోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ.44కోట్ల నిధులతో నూ తన రహదారుల నిర్మాణంతోపాటు రోడ్ల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్లు నిర్మాణం, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనం తదితర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ జగదీశ్వర్, ఈఈ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
జహీరాబాద్ టౌన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1 హైదరాబాద్‌లో పీఆర్టీయూ నిర్వహించతలపెట్టిన మహాధర్నా పోస్టర్‌ను ఎమ్మార్పీస్ కార్యాలయం వద్ద ఆదివారం ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు.

మండపాల వివరాలు నమోదు చేసుకోవాలి

మండపాల వివరాలు నమోదు చేసుకోవాలి