
అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం
నర్సాపూర్ రూరల్: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అచ్చంపేటలో పార్టీ కార్యకర్తలతో కలిసి స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, యువత, విద్యార్థులు అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అంబేడ్కర్ దేశంలోని అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పొందుపరచారన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నగేష్, దళిత మోర్చ నాయకులు అంజి, భిక్షపతి, విక్రం, లడ్డు, నారాయణరెడ్డి, విక్రం పాల్గొన్నారు.