మల్లయ్య తిన్న ముక్క.. మల్లయ్యనే ఇబ్బంది పెట్టింది! | Chicken Bone Stuck in Throat Removed Safely | Sakshi
Sakshi News home page

మల్లయ్య తిన్న ముక్క.. మల్లయ్యనే ఇబ్బంది పెట్టింది!

Apr 11 2026 10:58 AM | Updated on Apr 11 2026 12:58 PM

Chicken Bone Stuck in Throat Removed Safely

మెదక్ జిల్లా: ఓ శుభకార్యానికి వెళ్లిన వ్యక్తికి భోజనం చేస్తున్న క్రమంలో గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన తూప్రాన్‌ పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ అమర్‌సింగ్‌ వివరాల ప్రకారం... మాసాయి పేట మండలం హాకీంపేట గ్రామానికి చెందిన పి.మల్లయ్య తూప్రాన్‌లో బంధువుల శుభకార్యానికి హాజరయ్యాడు. 

అక్కడ భోజన సమ యంలో చికెన్‌, చపాతి తింటున్న క్రమంలో గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ స భ్యులు, బంధువులు వెంటనే పట్టణంలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అమర్‌సింగ్‌ వైద్య సిబ్బందితో కలిసి రెండు గంటలు శ్రమించి ‘హెంబ్లిక్‌ పద్ధతి’తో చికెన్‌ ముక్కను గొంతులో నుంచి బయటకు తీశారు. దీంతో మల్లయ్యకు ప్రాణాపాయం తప్పింది. వైద్యుల చేసిన కృషిని కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement