మెదక్‌జోన్: క్రమం తప్పకుండా యోగా చేయ డం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ‘హెల్త్‌వీక్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో హోమియోపతి, ఆయుష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వయో, లింగ భేదం లేకుండా అందరూ యోగాను సాధన చేయాలన్నారు. పురాతన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనంగా గుర్తించారన్నారు. యోగా సాధన ద్వారా జీవనశైలిలో మార్పు వస్తుందని, అనేక వ్యాధులను నివారించుకోవచ్చని వివరి ంచారు. అంతకుముందు కలెక్టర్ పలు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, డీఎంహెచ్‌ఓ శ్రీరాం, డీఈఓ విజయ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, యోగా గురువులు రవి, మనోరంజని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


