రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం సకాలంలో రుణాలు చెల్లించాలి పశువులకు టీకాలు తప్పనిసరి పాఠశాల కూల్చివేతపై కేసు నమోదు

ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్‌జోన్‌: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ‘అరైవ్‌– అలైవ్‌ వీక్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సర్పంచ్‌ అధ్యక్షతన రోడ్‌ సేఫ్టీ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

పెద్దశంకరంపేట(మెదక్‌): పెద్దశంకరంపేట మండల పరిధిలోని రామోజీపల్లి, బూర్గుపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివా రం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్‌ పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

నర్సాపూర్‌ రూరల్‌: మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు వాయిదాల పద్ధతిలో నిర్ణీత గడువులోగా చెల్లించాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఆవంచలో నిర్మిస్తున్న మహిళా సంఘం నూ తన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశమై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రభు త్వం మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. గర్భిణులు, బా లింత లు, చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకునే విధంగా మహిళా సంఘాల సభ్యులు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్‌, సీసీ రవీందర్‌, వీఓ మల్లేశ్వరి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

తూప్రాన్‌: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. 8వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా 4 నెలలు పైబడిన పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పశువుల్లో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం తగ్గుతుందన్నారు. పాడి రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. అందుకే ఏడాదికి రెండు సార్లు పశువులకు వ్యాధి నిరోధక టీకాలు కచ్చితంగా ఇప్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి లక్ష్మి, లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్‌ రమేశ్‌, రామకృష్ణ, కృష్ణ, శ్రీనివాస్‌, గోపాలమిత్ర, పశు పోషకులు తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు: పటాన్‌చెరులోని పాఠశాల కూల్చివేతపై ఎంపీ రఘునందన్‌రావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాల తరగతి గదుల నిర్మాణాలను కూల్చివేశారు. అదేరాత్రి ఎంపీ రఘునందన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి కూల్చివేతను ఆపాలని ఆదేశించగా... అప్పటికే బడిని నేలమట్టం చేసేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement