మెదక్ కలెక్టరేట్: దేశంలోని టాప్ 5 సైనిక్ స్కూల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన కొడగు సైనిక్ స్కూల్‌కు మెదక్‌కు చెందిన విద్యార్థి రిహాన్‌శౌర్య ఎంపికయ్యాడు. జనవరి 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రిహాన్ అద్భుత ప్రతిభ కనబర్చాడు. దేశ నలుమూలల నుంచి సుమారు 1,80,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కఠిన పోటీలో విద్యార్థి 300కు 275 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 982 సాధించాడు. ఈ విషయమై విద్యార్థి తండ్రి, అగ్రికల్చర్ ఏఈఓ రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.
నర్సాపూర్: విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం పట్టణంలో పర్యటించా రు. నర్సాపూర్‌లోని ఎంఎల్‌ఎస్ గోదాంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. బియ్యం స్టాక్, రికార్డులు తనిఖీలు చూశారు.


