సీఎం మాటలను ప్రజలు నమ్మరు! : ఆవుల రాజిరెడ్డి

- - Sakshi

కాంగ్రెస్‌ నర్సాపూర్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి

సాక్షి, మెదక్‌: సీఎం కేసీఆర్‌ మోసపూరిత హామీలను నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తానని, 2018లో నర్సాపూర్‌ను దత్తత తీసుకుని బంగారు తునక చేస్తానని సీఎం హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని, ప్రస్తుతం ఇచ్చేవాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన చెప్పారు.

ధరణి.. పేద రైతుల పాలిట శాపంగా మారిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్‌ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ఇచ్చిన హామీలన్నీ గతంలో మాదిరిగానే తుంగలో తొక్కుతారని ఎద్దేవా చేశారు. దేవులపల్లి, వెల్మకన్నె, ముండ్రాయి, శివ్వంపేట తదితర గ్రామాలకు చెందిన రైతుల భూములను ధరణిలో పార్ట్‌ బీలో పెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని, అనంతరం వాటి రికార్డులు సరి చేయించుకుని అధిక ధరలకు అమ్ముతూ కోటీశ్వరులయ్యారని విచారం వ్యక్తం చేశారు.

కాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంను మండల కేంద్రం చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. సమావేశంలో చిలిపిచెడ్‌ మాజీ జెడ్పీటీసీ చిలుముల శేషాసాయిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఖాలేక్‌, నాయకులు ఆంజనేయులుగౌడ్‌, రిజ్వాన్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌గుప్తా, రవీందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజాగౌడ్‌, మల్లేష్‌గౌడ్‌, అశోక్‌, రామాగౌడ్‌, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో ప్రచారం!
ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా నర్సాపూర్‌లోని రెండో వార్డులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో చిన్న అంజిగౌడ్‌, సుధీర్‌గౌడ్‌, రషీద్‌ పాల్గొన్నారు.

అప్పుల్లో తెలంగాణ..
నర్సాపూర్‌ మండలంలోని తుజాల్‌పూర్‌, తిరుమలాపూర్‌, బ్రాహ్మణపల్లి ఆయా పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో ఆవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్‌ నాయకులు అప్పుల పాలుచేశారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ తీసుకువచ్చిన 6 గ్యారంటీ పథకాలను గుర్తించి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఆంజనేయులు గౌడ్‌, శ్రీనివాస్‌ గుప్తా, రవీందర్‌ రెడ్డి, మల్లేష్‌, అశోక్‌, ఆకుల నర్సింలు, సుధీర్‌ గౌడ్‌, నందు, అశోక్‌ గౌడ్‌, ఉదయ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని విఠల్‌ తండా సమీపంలో ధాన్యం నూర్పిడి పడుతూ ఓటు వేయాలని రాజిరెడ్డి కోరారు.

ఆరు గ్యారంటీలు అమలు..
శివ్వంపేట:
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీలు అమలు చేయనున్నట్లు కాంగ్రెస్‌ అభ్యర్థి రాజిరెడ్డి భార్య శైలజారెడ్డి, సుహాసినిరెడ్డి, కమల, సుదర్శన్‌గౌడ్‌, నవీన్‌గుప్తాలు అన్నారు. శుక్రవారం దంతన్‌పల్లి, రత్నపూర్‌ తండాతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంఘటితంగా కృషిచేయాలి!
వెల్దుర్తి: 
నర్సాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గెలుపుకోసం కార్యకర్తలు సంఘటితంగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉప్పులింగాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, కిషన్‌, సత్యనారాయణ, మహేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిక..
ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, సర్వర్‌మీర్జా కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు నారాయణ రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, భూమయ్య, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

హత్నూర: నర్సాపూర్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం రేండ్లగూడ గ్రామా నికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆవుల కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో దౌల్తాబాద్‌ సర్పంచ్‌ కొన్యాల వెంకటేశం, కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి హకీం పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-11-2023
Nov 18, 2023, 09:43 IST
సాక్షి, కరీంనగర్‌: నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుంచి నన్ను తీసేశారట.. నేనేమన్నా ఆయన...
18-11-2023
Nov 18, 2023, 09:11 IST
సాక్షి,  కరీంనగర్/పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. దీంతో కొత్తగా వచ్చిచేరిన నేతలు లేదా...
18-11-2023
Nov 18, 2023, 08:58 IST
మెదక్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రావు మాటలకు అర్థాలే వేరులే.. అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాను గెలిస్తే రోజుకు...
18-11-2023
Nov 18, 2023, 08:27 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖానాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా’నని బీఆర్‌ఎస్‌ పార్టీ...
18-11-2023
Nov 18, 2023, 08:05 IST
సాక్షి, ఆదిలాబాద్‌/మంచిర్యాల: వారంతా విద్యాధికులే.. ఉన్నత లక్ష్యంతో డిగ్రీ, పీజీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినవారే. వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూనే ప్రజాసేవ...
18-11-2023
Nov 18, 2023, 07:36 IST
హైదరాబాద్: శాసనసభలో అడుగు పెట్టాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ రాజకీయ నాయకుడి కల. గెలిచిన అభ్యర్థులకేమో ప్రభుత్వం ఏర్పాటయ్యాక...
18-11-2023
Nov 18, 2023, 06:40 IST
మెదక్‌/గజ్వేల్‌: బీజేపీ నేత ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆరేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల కోసం ఆపద...
18-11-2023
Nov 18, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిపై (యూనిఫాం సివిల్‌ కోడ్‌) నిర్ణయం తీసుకుంటుందని...
18-11-2023
Nov 18, 2023, 03:23 IST
సాక్షి, వరంగల్‌/ వరంగల్‌/ నర్సంపేట/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రమిస్తే.....
18-11-2023
Nov 18, 2023, 01:36 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల ప్రజాఆశీర్వాద...
17-11-2023
Nov 17, 2023, 20:18 IST
‍సాక్షి, హైదరాబాద్‌ : విరాట్  కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,...
17-11-2023
Nov 17, 2023, 17:12 IST
సాక్షి,వరంగల్‌ : తెలంగాణ ఇస్తే పేదలకు మంచి జరుగుతుందని భావించామని, అయితే వారికి ఎలాంటి మేలు జరగలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ...
17-11-2023
Nov 17, 2023, 15:20 IST
సాక్షి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ మోసకారి పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 60 ఏండ్లు గోస పెట్టిన పార్టీ...
17-11-2023
Nov 17, 2023, 13:07 IST
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ...
17-11-2023
Nov 17, 2023, 12:48 IST
ఆరు గ్యారెంటీల్ని కలిపేసుకుని 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి..
17-11-2023
Nov 17, 2023, 12:27 IST
హనమకొండ: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో పౌరుడు తన...
17-11-2023
Nov 17, 2023, 11:59 IST
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టానికి రెండు...
17-11-2023
Nov 17, 2023, 11:49 IST
సాక్షి, నిజామాబాద్‌: 58 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో గోసలు పడ్డాం. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపిండ్రు. ఎన్నో పోరాటాల అనంతరం...
17-11-2023
Nov 17, 2023, 10:28 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
17-11-2023
Nov 17, 2023, 10:14 IST
సాక్షి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కామన్‌ సింబల్‌ ఉండగా వారు ఇప్పటికే... 

Read also in:
Back to Top