తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై.. | - | Sakshi
Sakshi News home page

తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై..

Oct 31 2023 6:50 AM | Updated on Oct 31 2023 8:34 AM

- - Sakshi

సాక్షి, మెదక్‌: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి తాను వేసి వలె మృత్యుపాశమైంది. చేపలకోసం వేసిన వల చిక్కుకొని మత్య్సకారుడు మృతి చెందిన ఘటన సోమవారం పెద్దశంకరంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే పేటకు చెందిన బొగ్గుల పెంటయ్య(32) చేపలు పట్టుకొని అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం పెద్దశంకరంపేట మండలం సంగారెడ్డిపేట శివారులోని నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లాడు.

నీటిలో వల విసిరిన తర్వాత ప్రమాదవశాత్తు అదే వలకు చిక్కుకొని నీటిలో మునిగిపోయాడు. అతడితో వెళ్లిన వారు గమనించి బయటకు తీసేలోపే మృతి చెందాడు. పెంటయ్యకు భార్య పుష్ప, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement