దర్యాప్తు వేగంగా జరగాలి | - | Sakshi
Sakshi News home page

దర్యాప్తు వేగంగా జరగాలి

Jul 15 2026 12:11 PM | Updated on Jul 15 2026 12:11 PM

దర్యాప్తు వేగంగా జరగాలి మత్తుతో భవిష్యత్తు చిత్తు వందశాతం ‘సర్‌’ పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

మెదక్‌జోన్‌: ప్రతి కేసులో దర్యాప్తు వేగంగా జరగాలని, రోడ్డు ప్రమాదాలు, సైబర్‌, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నిర్ణీత గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయా లని సిబ్బందిని ఆదేశించారు. కేసుల్లో శాసీ్త్రయంగా ఆధారాలను సేకరించి నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామానికి విలేజ్‌ పోలీస్‌ను నియమించి, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆర్థిక నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పా ట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్‌, సుభాశ్‌ చంద్రబోస్‌, సీఐలు రేణుక, రాజశేఖర్‌రెడ్డి, వెంకటరాజాగౌడ్‌, మహేశ్‌, జార్జ్‌, సందీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

నర్సాపూర్‌: మత్తు పదార్థాలతో ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ నియంత్రణ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవ గాహన కల్పించారు. బీవీఆర్‌ఐటీ డైరెక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ సంజయ్‌దూబె మాట్లాడుతూ.. తోటి విద్యార్థుల ఒత్తిళ్లకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని హితవుపలికారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ ట్రైనీ ఏఈఎస్‌ సతీశ్‌కుమార్‌, సీఐ గులాం ముస్తాఫా, ఎస్‌ఐలు అజీజ్‌ఖాన్‌, అరుణ తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు 76వ బూత్‌లో బీఎల్‌ఓ బైరం సుజాత 100 శాతం సర్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఈమేరకు తహసీల్దార్‌ రజని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మిగితా బీఎల్‌ఓలు సుజాతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్‌ కమీషనర్‌ రవీందర్‌, కౌన్సిలర్లు నాగరాజు, బైరం స్వప్న, దేవుని రంజిత్‌, డీసీసీ కార్యదర్శి గణేశ్‌ ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): గ్రామాల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట ఎంపీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎంపీడీఓ దామోదర్‌కు పలు సూచనలు చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక జాగ్రత్తగా తయారు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణను నాలుగు అంచెలుగా నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం హసింగ్‌ డీఈ యా దగిరితో కలిసి ఎంపీపీ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్‌ ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ వినోద్‌కుమార్‌, హసింగ్‌ ఏఈ లోకేష్‌ ఉన్నారు.

కొల్చారం(నర్సాపూర్‌): మండల కేంద్రంలోని కొల్చారం సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మహమూద్‌ అలీ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement