బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాములు
రామాయంపేట(మెదక్): జాతీయ రహదారి ఆధ్యా హోటల్ జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మంజూరును అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే పద్మారెడ్డి అడ్డుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగిరాములు కౌన్సిలర్ శంకర్‌గౌడ్, పార్టీ పట్టణాధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, సీనియర్ నాయకులు పబ్బ సత్యం, భానుచందర్ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో బ్రిడ్జి నిర్మాణానికి గాను జాతీయ రహదారుల శాఖ అధికారులు సానుకూలంగా ఉన్నా, తమ స్వలాభం కోసమే అడ్డుకున్నారని ఆరోపించారు. తమ అనుచరుల భూములు పోతాయనే ఉద్దేశంతోనే బ్రిడ్జి మంజూరు కాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తాజాగా పద్మారెడ్డి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమిస్తానని ప్రకటించడం తగదని, ఇది ప్రజలను తప్పుతోవ పట్టించడమేనని అన్నారు. అభివృద్దిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులు కుట్రలు పన్నతున్నారని, వారిని ప్రజలు విశ్వసించరని ఆయన స్పష్టం చేశారు.


