పండుగ అదిరింది..! | - | Sakshi
Sakshi News home page

పండుగ అదిరింది..!

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

● రూ.75కోట్లపైనే అన్ని రకాల వ్యాపారం ● గుడిపేట లిక్కర్‌ డిపో పరిధిలో భారీగా మద్యం అమ్మకాలు

● రూ.75కోట్లపైనే అన్ని రకాల వ్యాపారం ● గుడిపేట లిక్కర్‌ డిపో పరిధిలో భారీగా మద్యం అమ్మకాలు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): దసరా పండుగ జోరుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటగా రూ.75కోట్లకు పైగానే వ్యాపా రం సాగినట్లు తెలుస్తోంది. నూతన వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌, వాహనాల కొనుగోళ్లు, మద్యం, మంసానికి భారీగా ఖర్చు చేశారు. జిల్లాలోని గు డిపేట లిక్కర్‌ డిపో పరిధిలో ఈ వారం రోజుల్లో రూ.30కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగినట్లు తెలుస్తోంది. డిపో పరిధిలో జిల్లాతోపాటు పెద్దపల్లి జిల్లా రామగుండం, మంథని, భూపాలపల్లి జిల్లా కాటారం, జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతాల్లోని 135 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉన్నాయి. వీటికి ఇక్కడి నుంచే మద్యం నిల్వలు సరఫరా అవుతాయి. లిక్కర్‌, బీర్‌ కేసుల విక్రయాలు రూ.30కోట్లు జరిగాయి. జిల్లాలో 500కు పైగా మాంసం దుకాణాలు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో వేల సంఖ్యలో మేకలు, గొర్రెలు, కోళ్ల విక్రయాలు సాగాయి. జిల్లా వ్యాప్తంగా రూ.15కోట్లకు పైగా వ్యాపారం సాగి నట్లు వ్యాపారుల అంచనా. బట్టల దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్‌, హోం అప్లయెన్సెస్‌, వాహన కొనుగోళ్లు తదితర వ్యాపారాలు జోరుగా సాగినట్లు తెలుస్తోంది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా రూ.20 కోట్లకు పైగానే వస్త్ర వ్యాపారం జరుగగా.. ఎలక్ట్రానిక్‌, హోం అప్లయెన్స్‌స్‌ దుకాణాలతోపాటు మిఠాయిలు, కూల్‌డ్రింక్స్‌, ద్విచక్ర వాహన, కార్లు, మొబైల్‌ఫోన్ల కొనుగోళ్లు బాగానే జరిగాయి. అన్ని రకాల వ్యాపారాలు రూ.30 కోట్లపైనే సాగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement