శ్రీరాంపూర్: రగ్బీ క్రీడలో రాణించాలని రగ్బీ డెవలప్మెంట్ ఆఫీసర్ శేషు గుప్తా తెలిపారు. గురువారం శ్రీరాంపూర్లోని ప్రగతి మైదానంలో ఖేలో ఇండియా అస్మిత అండర్–15 బాలికల రగ్బీ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. 8 పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేసి మాట్లాడారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. పోటీల్లో ప్రథమ బహుమతి శ్రీ చైతన్య హైస్కూల్ (మంచిర్యాల) ద్వితీయ బహుమతి శ్రీ చైతన్య హైస్కూల్ (మందమర్రి), తృతీయ బహుమతి రేడియంట్ హైస్కూల్ (సీసీసీ)లు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆవునూరు మహేశ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భీమిని రాజేష్, క్రీడాకారులు దుంపటి మాధవ్, సుర మహేందర్, దుర్గం దినేష్ కుమారస్వామి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.


