మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రమైన మంచిర్యాల మోడల్స్కూల్లో గురువారం పీఎంశ్రీ జిల్లాస్థాయి బాలికల క్రీడాపోటీలను అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించారు. కబడ్డీ పోటీల్లో ఎంతో ఉత్సాహంతో కూతపెడుతూ విద్యార్థినులతో తలపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లాలో 25 పీఎంశ్రీ పాఠశాలల నుంచి 500 మంది విద్యార్థినులు ఈపోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్తోపాటు అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎంఈవో మాళవిదేవి, సెక్టోరల్ అధికారి సత్తయ్య, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ బుచ్చన్న, ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకుబ్, పీఎంశ్రీ పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


