శ్రీరాంపూర్: సింగరేణిలో గెలిచిన సంఘాలు కార్మి కుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలి పారు. బుధవారం రాత్రి నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్లో బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్ అ ధ్యక్షతన నిర్వహించిన ఏరియా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో కార్మికులకు అనేక హామీలు ఇచ్చి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ గెలి చాయన్నారు. నేడు కార్మికులకు కనీసం రక్షణ పరికరాలు ఇప్పించడం లేదన్నారు. గనుల్లో పనిముట్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. సంఘాలు సొంత పనులు, పైరవీలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఇటీవల మృతిచెందిన యూనియన్ మాజీ నేత పీటీ స్వామికి నివాళులర్పించారు. యూని యన్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రాంమూర్తి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ నా యకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేశ్‌రెడ్డి, ఎండీ లాల, గడ్డం వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


