మంచిర్యాలఅర్బన్/ఆదిలాబాద్: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అసిస్టెంట్ డిపో కంట్రోలర్ (ఏడీసీ) ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోభాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్హులైన ఉద్యోగులకు గురువారం రీజియన్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మంచిర్యాల డిపోకు చెందిన ఆరుగురు కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లకు ప్రమోషన్లు లభించాయి. సుదీర్ఘకాలానికి ప్రమోషన్లు లభించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రీజియన్ వారీగా 41 ప్రమోషన్లు లభించగా మంచిర్యాల డిపో నుంచి టీవీ ప్రసాద్, మణి, జీఎస్నారాయణ, ఎంఎస్‌రెడ్డి, టి.వెంకటి, నాగేశ్వరావు, వి.భీమేశ్వరావు, సునీల్‌కు ఏడీసీ, కంట్రోలర్‌గా ప్రమోషన్ పొందారు. వీరితోపాటు ప్రమోషన్లు పొందిన మరో ఆరుగురిని మంచిర్యాల డిపోకే కేటాయించారు.


