మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని పాత సీఎస్పీ వద్ద జరుగుతున్న రైల్వే సైడింగ్ అభివృద్ధి పనులను జీఎం (ఈఅండ్ఎం) శ్రీనివాసులు పరిశీలించారు. గురువారం ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఏరియాలో ఉత్పత్తి చేసిన బొగ్గును రవాణా చేసేందుకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి ఝా, డీజీఎం (కార్పొరేట్) ఎస్కే ఖరీముల్లా, కేకే ఓసీ పీవో రాంబాబు, డీజీఎం అశోక్, తదితరులు ఉన్నారు.


