మంచిర్యాలటౌన్: ప్రజలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. నషాముక్త్ భారత్ అవగాహన ర్యాలీని బుధవారం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 14వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సునిల్, డెమో బుక్క వెంకటేశ్వర్, ఇంటర్మీడియేట్ బోర్డు అధికారి అంజయ్య, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్ పాల్గొన్నారు.


