జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) పాఠశాల/కళాశాల విద్యార్థి జాతీయ స్థాయి సాప్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. 6వ తరగతి విద్యార్థి వేల్పుల రిషి ఈ నెల 16, 17న హన్మకొండ ఎల్‌బీ కళాశాల మైదానంలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్‌–13 విభాగం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. బెస్ట్‌ ఆల్‌ రౌండ్‌ ప్లేయర్‌గా నిలువడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారని సీవోఈ ప్రిన్సిపల్‌ ఆకిడి విజయసాగర్‌ తెలిపారు. ఈ నెల 29, 30, 31న మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ కోపర్గాన్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. రిషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ తన్నీరు గోపి, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ దుర్గం రమాదేవి, కమలాకర్‌, శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు ముచ్చ కుర్తి రాజశేఖర్‌, ఆలూరి వామన్‌ పాల్గొన్నారు.

బాస్కెట్‌బాల్‌

ఎంపిక పోటీలు

మంచిర్యాలఅర్బన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో అండర్‌ –17, అండర్‌ –14 బాలబాలికల జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్‌, పోటీల నిర్వాహకులు రాజయ్య, బెల్లం శ్రీనివాస్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

పులి దాడిలో ఆవు మృతి

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): లక్సెట్టిపే ట అటవీ రేంజ్‌ పాతమంచిర్యాల అటవీ సెక్షన్‌ పరిధిలో ర్యాలీ అటవీ శివారు ప్రాంతంలో ఈ నెల 23న పులి దాడిలో ఓ ఆవు మృత్యువాకు గురైంది. ర్యాలీ గ్రామానికి చెందిన ఆత్రం భీంరావుకు చెందిన ఆవు మే తకు వెళ్లగా పులి దాడి చేసింది. పులి అడుగులు గుర్తించిన అధికారులు పులి ఏ వైపుగా వె ళ్లి ఉంటుందని క్షేత్రస్థాయిలో పర్యటించినా గుర్తించలేకపోయారు. కాగా పులిదాడిలో మృత్యువాతకు గురైన ఆవుకు నష్టపరి హార ం ఇప్పించేలా నివేదిక తయారు చేసిన ట్లు అటవీ రేంజ్‌ అధికారి సంతోష్‌ తెలిపారు.

ఒకరి అదృశ్యం

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన మోహన్‌ అనే యువకుడు అదృశ్యమైనట్లు టూటౌన్‌ ఎస్సై అఖిల్‌ తెలిపారు. ఈనెల 23న పెయింటింగ్‌ పనుల కోసం నిజామాబాద్‌ వెళ్తున్నానని ఇంట్లో చె ప్పి వెళ్లాడు. 25న ఆయనకు ఫోన్‌ చేస్తే కలవ డం లేదని, స్విచ్‌ ఆఫ్‌ వస్తుందని కుటుంబీకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement