లక్సెట్టిపేట: మండలంలోని జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్(28) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆసుపత్రికి వెళ్లినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఈనెల 23న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. తల్లి వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


