లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ (42) అనే వ్యక్తి మద్యానికి బానిసై మృతి చెందినట్లు స్థానిక ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు. వివరాల ప్రకారం మృతుడు గత కొద్దిరోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 27వ తేదీన సాయంత్రం పాత బస్టాండ్లోని వైన్స్ షాప్ వద్ద అతిగా మద్యం తాగి కిందపడడంతో గాయాలై మృతి చెందాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై పేర్కొన్నారు.


