గిరి పుత్రిక వైద్యవిద్యకు దాతల సహకారం | - | Sakshi
Sakshi News home page

గిరి పుత్రిక వైద్యవిద్యకు దాతల సహకారం

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

తాండూర్‌: గిరి పుత్రిక పెంద్రం శిరీష వైద్య విద్యకు దాతలు అండగా నిలుస్తున్నారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘డాక్టర్‌ కల నెరవేరేది ఎలా’ శీర్షికన కథనం ప్రచురితం కాగా పలువురు దాతలు స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూ రం రవీందర్‌రెడ్డి దంపతులు నర్సాపూర్‌లోని పెంద్రం శిరీష ఇంటికి వెళ్లి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మరింత భరోసా అందించేలా చొరవ తీసుకుంటా మని వారు హామీ ఇచ్చారు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం లింగాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వాల్‌గోట్‌ కిషన్‌ రూ.5 వేల ఆర్థిక సాయం చేశారు. దీంతోపాటు మరికొంత మంది దాతలు ముందుకొ చ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement