ఈకేవైసీలో ఎస్‌హెచ్‌జీ ముందంజ | - | Sakshi
Sakshi News home page

ఈకేవైసీలో ఎస్‌హెచ్‌జీ ముందంజ

Sep 13 2026 12:06 AM | Updated on Sep 13 2026 12:06 AM

● జిల్లాలో 50శాతం పూర్తి ● రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం

దండేపల్లి: స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. బ్యాంక్‌ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు ఏటా మంజూరు చేస్తోంది. రుణం పొందిన మహిళలు వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తున్నారు. ఇదే సమయంలో నిధులు పక్కదారి పట్టకుండా, ఖాతా వివరాలు పారదర్శకంగా నిర్వహించేలా సభ్యులకు ఈకేవైసీ(ఎలక్ట్రానిక్‌ – నో యువర్‌ కస్టమర్‌)ని తప్పనిసరి చేసింది. ఎస్‌హెచ్‌జీ సభ్యుల వివరాలు జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండేలా ‘లోకోస్‌’ యాప్‌తో అనుసంధానం చేశారు. సభ్యులు అర్హులా.. అనర్హులా అని తెలుసుకునేందుకు ప్రతీ సభ్యురాలి ఈ–కేవైసీని పూర్తి చేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీవోఏలు ఈకేవైసీ చేయడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 50శాతానికి చేరువై రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు. ఇప్పటికే అన్ని ఎస్‌హెచ్‌జీల వివరాలను ‘సెర్ప్‌’ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశారు. సంఘాల వారీగా సభ్యులు తీసుకున్న రుణాలు, చెల్లించిన వాయిదాలు, పొందిన వడ్డీ రాయితీ, తీసుకున్న సీ్త్రనిధి రుణాలు, చేస్తున్న వ్యాపారం, పొందుతున్న లాభాలు వంటివాటిని సమగ్రంగా నమోదు చేశారు. ఈకేవైసీ కూడా పూర్తయితే పొదుపు నిధులు పక్కదారి పట్టించలేరు. అనర్హులకు రుణ లబ్ధి కలిగే అవకాశం లేదు. కాగా, ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే ఈ–కేవైసీ చేయడం సాధ్యం కావడం లేదు. ఫోన్‌ నంబరు కూడా ఆధార్‌కు అనుసంధానమై ఉండాలి. ఫొటో ఆధార్‌తో సరిపోలాలి. సమస్యలను పరిష్కరించి ఈకేవైసీని త్వరగా పూర్తిచేయాలని వీవోలను జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ అధికారులు ఆదేశించారు. కొందరు సభ్యుల ఆధార్‌ అప్‌డేట్‌ కాక ఈకేవైసీ ఆలస్యమవుతోందని, నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని డీపీఎం స్వర్ణలత తెలిపారు.

జిల్లా వివరాలు..

సంఘాలు సభ్యులు ఈకేవైసీ పూర్తయినవారు

10,962 1,12,426 46,658

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement