మంచిర్యాలక్రైం/లక్సెట్టిపేట/మందమర్రిరూరల్/చెన్నూర్: రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో శనివారం తొమ్మిది ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించారు. మంచిర్యాల లోక్ అదాలత్‌లో సివిల్ దావాలు 32, క్రిమినిల్ కేసులు 4100, ఇతర కేసులు, సైబర్ క్రైం 2 కేసుల్లో రూ.17వేలు బాధితులకు ఇప్పించినట్లు తెలిపారు. 4,418 కేసులు పరిష్కరించినట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తులు జీ.కవిత, ఏ.నిర్మల, సీనియర్ సివిల్ జడ్జి డీ.రామ్‌మోహన్‌రెడ్డి, బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, లైజన్ ఆఫీ సర్ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
రాజీ మార్గమే రాజ మార్గం
Sep 13 2026 12:06 AM | Updated on Sep 13 2026 12:06 AM
● లోక్ అదాలత్‌లో 4,418 కేసులు పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య ● లక్సెట్టిపేటలో కోర్టు ఇంచార్జి జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ కేసులు పరిష్కరించారు. బార్‌అ సోసియేషన్ అధ్యక్షుడు గోవింద్, న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమరెడ్డి, శ్రీధర్, సురేందర్, నలినీకాంత్, పద్మ, కిరణ్ పాల్గొన్నారు.
● మందమర్రి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష రికార్డు స్థాయిలో 647 సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆమెకు శాలువా కప్పి సన్మానించారు.
● చెన్నూర్ కోర్టులో 912 కేసులు పరిష్కారం అయ్యాయని సివిల్ జడ్జి పర్వతపు రవి అన్నారు. కేసుల పరిష్కారానికి కక్షిదారుల నుంచి రూ.21,74,188 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొలిపాక రవీందర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Advertisement


