మంచిర్యాలఅర్బన్: నగరంలోని రాముని చెరువు కట్టపై రాఖీపౌర్ణమి పురస్కరించుకుని బుధవారం ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో మనిషికి చెట్టు రక్ష.. చెట్టుకు మనిషి రక్షలో భాగంగా వృక్షాబంధన్ నిర్వహించారు. వివిధ ప్రకృతి మిత్ర పదార్థాలతో అట్ట, కాగితం, ధాన్యం గింజలు, ఆకులు, పూల రెక్కలు, డ్రైఫ్రూట్స్ వ్యర్థాలు, దూదితో చేసిన ఆకర్షణీయమైన రాఖీలను చెట్లకు కట్టి ఆలింగనం చేసుకున్నారు. చెట్ల చూట్టూ మానహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి మిత్ర సంస్థ వ్యవస్థాపకుడు యోగేశ్వర్, ఫారెస్ట్ రెంజ్ అధికారి రత్నాకర్‌రావు, టీఎన్‌జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రకృతి మిత్రులు ప్రభాకర్, శరత్‌చంద్ర, రాజశేఖర్, మధు, చందన, రాధేశ్యాం, రాందాస్, జన్మభూమినగర కాలనీ వాసులు, వాకర్స్ పాల్గొన్నారు.


