పోలీసులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

జైపూర్‌: పోలీస్‌ సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. సీజ్‌ చేసిన వాహనాలు, రికార్డులు, పెండింగ్‌ కేసుల ఫైళ్లు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, మత్తుపదార్థాల నిర్మూలన, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐ నవీన్‌కుమార్‌, ఎస్సై భూమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement