నాది కోటపల్లి మండలం కావర్‌కొత్తపల్లి. తాతముత్తాతల నుంచి దసలికాయలను నమ్ముకుని బతుకీడుస్తున్నాం. మీ కాళ్లు మొక్కుతాం. దసలిపంట లేకుండా చేసి మా బతుకులను రోడ్డున పడేయకండి. అడవిలో పాములు, తేళ్ల మధ్య భయం భయంగా పొట్టకూటి కోసం బతుకుతున్నాం. పోయినేడాది నుంచి పట్టు పంట లేక తిండికి తిప్పలైతాంది. ప్రతీ ఏడాది మూడు పంటలు పండించి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలు సంపాదించా. రెండేళ్ల నుంచి రూపాయి సంపాదన లేక అవస్థలు పడుతున్నాం. ఈయేడు కొన్ని పురుగులు వేసుకున్న. ఈ పంట చేతికొస్తే రూ.10 వేలైనా వస్తాయి. పంటను పాడు చేయకండి.
– చింతకుంట లస్మయ్య


