ఉద్యోగుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పోరుబాట

Aug 26 2026 12:12 AM | Updated on Aug 26 2026 12:12 AM

● రేపు కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా ● అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపైకి ● డిమాండ్లు తీర్చే వరకు పోరాటం తప్పదంటున్న ఉద్యోగులు ● ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రధాన డిమాండ్లపైనే పోరాటం చేస్తున్నారు. ● రెండవ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి ● ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల డీఏలను వెంటనే విడుదల చేయాలి. ● ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఎంప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌)ను సమర్థవంతంగా, తక్షణమే అమలు చేయాలి. ● పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్‌ చేసేందుకు ప్రతీ నెల రూ.2 వేల కోట్లు విడుదల చేసి, ఉద్యోగుల బకాయిలను త్వరితగతిన చెల్లించాలి. ● ఉద్యోగుల సీపీఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలి. ● రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లకు గుర్తింపు కల్పించి, సమస్యలను అధికారికంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ● మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 17శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలి

మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యా య, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. ఈ నెల 27న నస్పూర్‌లోని కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, అటెండర్‌ స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు, అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉద్యోగులు మహాధర్నాలో పాల్గొనేలా టీజీఈజేఏసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నేరుగా వెళ్లి ఉద్యోగుల సమస్యల కోసం నిర్వహించే మహా ధర్నాలో పాల్గొనాలని, డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని కోరుతున్నారు. మహాధర్నాకు సహకరించాలని ఇప్పటికే కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌కు టీజీఈజేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఇవీ డిమాండ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement