మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని జన్మభూమినగర్‌లో సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. గోపగాని రవీందర్ తమ కవితను వినిపిస్తూ నదులెప్పుడూ ముందుకే పారుతాయని, మనుషులు గతంలో చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలని వివరించారు. కవిత్వం జనహితం మానవ జీవితంలో భాగమై సృజన కలిగి ఉండాలని మేసు మల్లేఽశం తమ కవితాగానం వినిపించారు. నీశక్తి కొలది నీవు నడవాలని ఒకడు తొడకోసుకుంటే నీవు మెడకోసుకోవడం తప్పు అనే సారంశంగా కవి అల్లాడి శ్రీనివాస్ కవితను వినిపించారు. ఉపాధ్యాయిని రూపారెడ్డి హత్యపై కవి దండనాయకుల వామన్‌రావు కవితను వినిపించారు. కార్యక్రమంలో జిల్లా సాహితీ సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.


