జన్నారం: టైగర్‌జోన్, ఇకో సెన్షిటివ్ జోన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట సా మాజిక పోరాట సమితి మండల అధ్యక్షుడు శ్రీరాముల భూమాచారి రిలే నిరాహార దీక్ష చే పట్టాడు. పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, యువజన సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇకో సెన్షిటివ్ జోన్ వల్ల మండల ప్రజలు ఇసుక లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, టైగర్‌జోన్ వల్ల అట వీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇకో సెన్షిటివ్ జోన్ ఎత్తి వేసి, ఇసుక కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.


