ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతా ల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రికి వివరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాలు మరింత బలోపేతం కావాలన్నారు. ప్రభుత్వ ఫలా లు ప్రతీ గిరిజనుడికి చేరేలా చూడాలన్నారు.


