చెన్నూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని 1, 8 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. బిల్లులు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, తహసీల్దార్ మల్లికార్జున్, డిప్యూటీ తహసీల్దార్ సనత్ కుమార్, ఎంఈవో సత్యనారాయణ, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


